మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం చేరుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మోరంపూడి జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. పార్టీ నాయకులతో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని కేబుల్ ఆపరేటర్లు ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ఇదీచదవండి