ETV Bharat / city

కొండమట్టి కరిగిపోతోంది.. గుండెల్లో గుబులవుతోంది!

వారంతా సామాన్య, పేద కుటుంబాలకు చెందిన వారు. కొండపైనే ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి పట్టాలు అందుకున్నారు. గ్రావెల్‌ కోసం ఇష్టారాజ్యంగా సాగిన తవ్వకాలు, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పుడు వారి జీవితం ప్రమాదపు అంచులో పడింది. ఇళ్లు.. ఏ క్షణానైనా కూలిపోయే ఉపద్రవం ముంచుకొస్తున్నా...పట్టించుకొనే నాథుడే కరవయ్యాడు.

hill houses in danger at rajamahendravaram bommuru venkatagiri

author img

By

Published : Sep 22, 2020, 5:52 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు వెంకటగిరి కొండపై సుమారు 200 ఇళ్లు ఉన్నాయి. పాతికేళ్ల క్రితమే ఇక్కడ ఉండే పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. స్థానికంగా సుద్దకొండగా పిలుచుకొనే ఈ కొండపై గతంలో గ్రావెల్‌ తవ్వకాలు విచ్చలవిడిగా సాగేవి. స్థానికులు నిత్యం ఆందోళనలు చేసేవారు. ఆ తర్వాత తవ్వకాలు ఆపేశారు. అయితే కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తోపాటు...గోదావరి తాగునీటి శుద్ధి ప్లాంటు నుంచి నీటిని కిందకు వదలడం వల్ల కొండమట్టి కరిగిపోతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.

కొండపై ఉన్న ఇళ్లకు సమీపంలోనే 33కేవీ లైన్‌ విద్యుత్‌ టవర్లు ఉన్నాయి. టవర్లకు సమీపంలోనూ మట్టి జారిపోతోంది. ఒకవేళ టవర్‌ కనుక ఒరిగితే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

సుద్దకొండపై ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని..ఇళ్లను, తమను కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.

కొండమట్టి కరిగిపోతోంది.. గుండెల్లో గుబులవుతోంది!

ఇదీ చదవండి: మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం..బర్తరఫ్​ చేయాలని విపక్షాలు డిమాండ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.