ETV Bharat / city

గోదావరికి పెరిగిన వరద.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ

ALERT AT DHAVALESWARAM : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. గోదావరిలో వరదనీటి ప్రవాహం పెరుగుతున్నట్టు.. రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ వెల్లడించింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి.. 10.04 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేవరకు లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ALERT AT DHAVALESWARAM
ALERT AT DHAVALESWARAM
author img

By

Published : Sep 13, 2022, 4:42 PM IST

Updated : Sep 13, 2022, 9:19 PM IST

గోదావరికి పెరిగిన వరద.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

FIRST ALERT AT DHAVALESWARAM : ఎగువన భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి వెళ్తోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విలీన, లంక గ్రామాల ప్రజలు మళ్లీ వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మళ్లీ గోదావరి వరద అలజడి మొదలైంది. ఈ సీజన్‌లో మూడోసారి గోదావరికి వరద రావడంతో.. తీర ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద అంతకంతకూ పెరుగుతోంది. విలీన మండలాలు మరోసారి ముంపు బారిన పడ్డాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు భయపడి ఇప్పటికే చాలా మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తుండగా.. మిగిలిన వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

రాజమహేంద్రవరానికి వరద పోటెత్తుతోంది. అఖండ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్టకు భారీగా నీరు చేరుతోంది. పెద్దఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

కోనసీమ జిల్లాలోని లంకలను వరదనీరు ముంచెత్తుతోంది. ఈ ఏడాది మూడోసారి వరద రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. లోతట్టు లంక భూముల్లోకి వరద నీరు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక వద్ద కాజ్‌వే వరద ముంపులో చిక్కుకుంది. కనకాయలంక గ్రామ ప్రజలు చాకలిపాలెం వైపు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

యానాం ప్రజలకు మొదలైన కష్టాలు : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. గౌతమి, గోదావరి వరద పోటెత్తడంతో.. యానాం ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పట్టణ వీధుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. స్లూయిజ్ నుంచి నీళ్లు రావడంతో ఇసుక బస్తాలు వేసి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాలనీలు నీటమునగడంతో.. బాధితులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని రెవెన్యూ అధికారులు సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2022, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.