జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కాపులకు సంక్షేమ పథకాలు అందటం లేదని..,రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ అన్నారు. రిజర్వేషన్ సాధన, పథకాల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయంలో పోరాడి సాధించుకున్న కాపు సంక్షేమ పథకాలకు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని జేఏసీ నేతలు ఆక్షేపించారు.
![సమావేశమైన ఐకాస నేతలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-56-10-kapu-jac-state-meeting-avb-ap10018_10102021161909_1010f_1633862949_144.jpg)
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలతో చర్చించి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. భవిష్యత్లో సమగ్ర కార్యాచరణ కోసం త్వరలోనే విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. సొంత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు, మంత్రులు కుల ప్రస్తావనలు తీసుకురావటం సరికాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ్, పలు జిల్లాల నుంచి వచ్చిన జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి