ETV Bharat / city

కాఫర్‌ డ్యాం నిర్మాణ తీరు మారాలి.. పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సిఫార్సు - పోలవరం న్యూస్

పోలవరం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుందని..ప్రాజెక్టు డిజైన్ కమిటీ ఛైర్మన్ పాండ్య విశ్వాసం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన పోలవరం డీడీఆర్​పీ సమావేశంలో.. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులు, గుత్తేదారులతో ఆయన చర్చించారు.

2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి

author img

By

Published : Feb 20, 2021, 4:02 PM IST

Updated : Feb 21, 2021, 4:37 AM IST

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ విధానం పూర్తిగా మారాలని డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ అధికారులకు సూచించింది. ఈ డ్యాం మరింత గట్టిగా, పటిష్ఠంగా ఉండాలంటే దీని నిర్మాణంలో సరైన మట్టిని వినియోగించాలని పేర్కొంది. మట్టి సేకరణ సమయంలో ఉన్న సాంద్రత, గట్టిదనం.. నిర్మాణంలో ఉపయోగించిన తర్వాత కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచించారు. రాజమహేంద్రవరంలో శనివారం పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ 16వ సమావేశం ఛైర్మన్‌ ఎ.బి. పాండ్య అధ్యక్షతన జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి

దిల్లీలోని మట్టి, ఇసుక పరిశోధన కేంద్రం నిపుణులు, పుణెలోని జల, విద్యుత్తు పరిశోధన కేంద్రం నిపుణులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై తమ అధ్యయనాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టులో వివిధ అంశాల్లో నాణ్యత, డిజైన్లపై చర్చించి ఈ కమిటీ సలహాలు ఇచ్చింది. ఇంతకుముందు సెప్టెంబరు 29న జరిగిన కమిటీ 15వ సమావేశంలో అనేక కీలకాంశాలు చర్చించి రెండు వరదల తర్వాత ఎగువ కాఫర్‌ డ్యాం గట్టిదనాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సంస్థ కాఫర్‌ డ్యాం వద్ద మట్టి నమూనాలు సేకరించి పరిశోధించి నివేదిక సమర్పించింది.

డ్యాం నిర్మాణంలో వినియోగించిన బంకమట్టి సాంద్రత నిర్మాణం తర్వాత మారిపోయిందని గుర్తించారు. ఇలాంటి రకం మట్టి వాడొద్దని, నిర్మాణం తర్వాత సామర్థ్యం మారని మట్టిని వినియోగించాలని కమిటీ సూచించింది. కాఫర్‌ డ్యాం నిర్మాణంలో చిప్స్‌ వాడే విధానం కూడా మార్చాలని కమిటీ పేర్కొంది. పెద్ద బండరాళ్లు తీసుకువచ్చి మిషన్‌ సాయంతో వాటి సైజు మార్చడం వల్ల నిర్దేశించిన ఆకృతిలో రావడం లేదని.. తొలుత 10 ఎంఎం, తర్వాత 20 ఎంఎం అలా పెంచితేనే కాఫర్‌ డ్యాం గట్టిదనం వస్తుందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సీపేజీ సమస్యలు రాకుండా డ్యాం గట్టిగా ఉంటుందన్నారు.

- స్పిల్‌ వే లోని 8 బ్లాకుల్లో పియర్స్‌ను ఆనుకుని ఉండే ట్రునియన్‌ గడ్డర్లలో కొంత డ్యామేజిని గుర్తించారు. అక్కడ మార్చి 15లోగా కాంక్రీటు గ్రౌటింగు చేయాలని కమిటీ సూచించింది.
- స్పిల్‌ వే గ్యాలరీలోకి వరద సమయంలో నీరు రావడం వల్ల అక్కడ కేబుల్స్‌ కొన్ని పాడయ్యాయని గుర్తించారు. ప్లంబాంబు ఖాళీగా ఉండాలి. అందులోకి కాంక్రీటు వెళ్లిందని, అది సరిచేయాలని సూచించారు. ఇక్కడ నీటి స్థాయిని, ప్రవాహాలను లెక్కకట్టే పరికరాలు వాడతారు. అవి పాడయ్యాయి. వాటిని సరి చేయించాలని, లేదా కొత్తవి వినియోగించాలని సూచించారు.
- స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే ఎడమవైపు గైడ్‌ బండ్‌ వంటి వాటిపై అనేక సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో నిపుణులు డి.పి.భార్గవ, పీపీఏ చీఫ్‌ ఇంజినీర్‌ ఎ.కె.ప్రధాన్‌, పోలవరం ఎస్‌ఈ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎడమ వైపు కోత.. కమిటీ సూచనలు
పోలవరంలో ఎడమగట్టు వైపు 70 మీటర్ల వరకు వరదలకు కోసుకుపోయింది. అక్కడ కట్‌ చేసి గ్రౌటింగు చేయాలని సూచించారు. ప్రధాన డ్యాం మొదటి ఖాళీలోనూ గోదావరి వరదలకు లంక ప్రాంతం గర్భంలో మట్టి బాగా కోసుకుపోయింది. అక్కడ డయాఫ్రం వాల్‌ మిషన్‌ తీసుకొచ్చి, మళ్లీ నిర్మాణం చేపట్టాలని కమిటీ సూచించింది. లేదా పైలింగు విధానంలో పనిచేయాలని పేర్కొంది.
- స్పిల్‌ ఛానల్‌ కుడివైపున అక్కడక్కడ జారిపోయింది. అక్కడ బండరాళ్లు నింపి వాటిని లెవెల్‌ చేసి రెండేళ్లు పరిశీలించాలని కమిటీ సూచించింది. ప్రాజెక్టు ప్రాంతంలో కొండలు ధ్వంసం చేసి అక్కడ నింపిన మట్టి స్పిల్‌ ఛానల్‌లోకి జారడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని పేర్కొంది.
- గేట్ల ఏర్పాటుకు 96 హైడ్రాలిక్‌ సిలిండర్లు వచ్చాయి. మిగిలినవి త్వరగా రప్పించాలని కమిటీ సూచించింది.
- స్పిల్‌ వే కుడివైపున ఎగువ కొండ ప్రాంతంలో కొంతమేర ఫాల్తు జోన్లు ఉన్నాయని గుర్తించారు. అక్కడ సిమెంటు కాంక్రీటుతో నింపి సరిచేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో పోలవరం కార్యదర్శి రంగారెడ్డి, ఆకృతుల విభాగం సీఈ శ్రీనివాస్‌, పోలవరం డిజైన్ల సలహాదారు గిరిధర్‌ రెడ్డి, మేఘా ఇంజినీరింగు సంస్థ డైరెక్టర్‌ సీహెచ్‌ సుబ్బయ్య, జీఎం సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

పోలవరం పనులు బాగా జరుగుతున్నాయి

పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయని, 2022లో నిర్దేశించుకున్న గడువు నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ ఛైర్మన్‌, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్య చెప్పారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన డిజైన్ల అంశాలను చర్చించామన్నారు. ·గేట్ల అమరిక బాగానే ఉందని, ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టులోనూ లేనంత ఎత్తయిన గేట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాటి అమరికపై కొన్ని సూచనలు చేశామన్నారు. స్పిల్‌ వే డిజైన్ల గురించి చర్చించామని, రిజర్వాయర్‌ ప్రాంతంలో ఆకృతుల పరంగా కొన్ని మార్పులు సూచించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు సంబంధించి రెండో డీపీఆర్‌ పురోగతిపై ప్రశ్నించగా ఆ విషయాన్ని కేంద్రం-రాష్ట్రం చూసుకుంటున్నాయని వెల్లడించారు. కరోనా సమయంలో పోలవరం నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు. గేట్ల ఏర్పాటు సంతృప్తికరంగానే ఉందని, వాటి విషయంలో ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా పాండ్య చెప్పారు.

ఇదీచదవండి

ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

Last Updated : Feb 21, 2021, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.