దేశాన్ని మోదీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భాజపాను వ్యతిరేకిస్తే సీబీఐ కేసులతో బెదిరిస్తున్నారన్నారు. అలా వ్యతిరేకిస్తే మరుసటిరోజే జగన్ జైలులో ఉంటారని వ్యాఖ్యానించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో మార్పులు వస్తాయని నారాయణ అభిప్రాయపడ్డారు. బెంగాల్ ఎన్నికల కోసమే మోదీ.. ఠాగూర్ వేషం వేశారని ఎద్దేవా చేశారు.
ఏపీకి అన్యాయం జరుగుతుంటే జగన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికలను తెదేపా బహిష్కరించడం సమంజసం కాదన్నారు.
ఇదీ చదవండి