తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. విజయవాడ నుంచి గత మంగళవారం తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీకి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విషయం తెలుసుకున్న కేంద్ర కారాగారం అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పాజిటివ్ వచ్చిన రిమాండ్ ఖైదీని కొవిడ్ 19 ఆసుపత్రికి తరలించారు. ఇవాళ 25 మంది ఖైదీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మొత్తం 200 మంది వరకూ ఖైదీలు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కారాగారానికి తీసుకొస్తున్న ఖైదీలకు ముందుగానే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాత్రం విజయవాడలోనే పరీక్షలు చేసినట్లు పోలీసులు సమాచారం అందించారు.