ధవళేశ్వరం ఆనకట్టపై గుంతలను అధికారులు పూడ్చివేయించారు. బ్యారేజీ వద్ద విద్యుద్దీపాలకు కూడా మరమ్మతులు చేపట్టారు. అక్టోబర్ 2న ధవళేశ్వరం బ్యారేజీపై పర్యటించి శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టాలని జనసేన ఇప్పటికే నిర్ణయించి ప్రకటించింది. కాగా పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా ఆనకట్టపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బ్యారేజీపై పర్యటనకు అనుమతి లేదని జలవనరుల అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ పర్యటన కొనసాగిస్తామంటున్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు.
ఇదీ చదవండి: బ్యారేజ్ ఇసుక వెలికితీత బాధ్యత ఆ సంస్థకే.. ప్రభుత్వం నిర్ణయం