ETV Bharat / city

SUICIDE ATTEMPT : తీవ్రమైన పోటీ...తెదేపా నేత ఆత్మహత్యాయత్నం - nellore corporation elections

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా, వైకాపా నేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. తెదేపా నాయకుడు, 49,50 డివిజన్ల క్లస్టర్ ఇన్​ఛార్జ్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. వైకాపా నేతల వేధింపులు తాళలేక శీనయ్య ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ
నెల్లూరు నగరపాలక సంస్థ
author img

By

Published : Nov 14, 2021, 5:04 PM IST

నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా, వైకాపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో తెదేపా నాయకుడు, 49, 50వ డివిజన్లలో క్లస్టర్ ఇన్​ఛార్జ్​గా ఉన్న కప్పిర శీనయ్య... నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైకాపా నాయకల వేధింపులు కారణంగా శీనయ్య ఆత్మహత్యకు యత్నించాడని తెదేపా నేతలు ఆరోపించారు. తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా పనిచేయవద్దని వైకాపా నాయకులు చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆక్షేపించారు.

ఇదీచదవండి: Kanakamedala: భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం: కనకమేడల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.