Staff not available: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వైద్యం కోసం వచ్చి ఆస్పత్రి ఎదుటే వేచి చూడాల్సి వచ్చిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. అర్థరాత్రి కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ... 2గంటల సమయంలో సిబ్బంది లేక ఆరుబయటే వేచి ఉన్నామని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు. మహిళ అవస్థను చూసి వాచ్మెన్ తెల్లవారుజామున... నర్సును తీసుకొచ్చి వైద్యం అందించారన్నారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉన్నాయని,.. సిబ్బంది ఉందుబాటులో లేరని బంధువులు ఆరోపించారు. సిబ్బంది లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వైద్య సిబ్బంది తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: