Theft of key documents: నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన వాటిని కాలువలో పడేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య నడుస్తున్న ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఈ చోరీ నేపథ్యంలో.. నిత్యం తెరిచి ఉండే కోర్టు తలుపులు, గేటును ఇవాళ మూసివేశారు.
సంబంధిత కథనం: మంత్రిగారి కేసు.. కోర్టులో దొంగలు పడ్డారు