papaya news: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని రవీందర్ రెడ్డి అనే రైతు పొలంలో ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. బొప్పాయి సాగు చేస్తున్న రైతు పొలంలో కాసిన బొప్పాయి అచ్చం విఘ్నేశ్వరుడి ఆకారంలో ఉండడంతో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మెలిచిన బొప్పాయి మొక్కను కొన్ని నెలల క్రితం తీసుకొచ్చి తన పొలం గట్టుపై నాటాడు. పదుల సంఖ్యలో కాయలు కాస్తున్నాయి. ఎప్పటిలాగే పొలంలో పనికి వెళ్లిన రవీందర్‌రెడ్డికి తాజాగా వినాయకుడి రూపంలో ఉన్న బొప్పాయి దర్శనమిచ్చింది. శివరాత్రి ముందు రోజు బొప్పాయిలో లంబోదరుడు దర్శనమివ్వడం శుభసూచకమని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ బొప్పాయి విఘ్నేశ్వరుడిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇదీ చదవండి:
Shivaratri Story: మహా శివరాత్రి పర్వదినాన పూజ ఏ విధంగా చేయాలంటే..