ETV Bharat / city

నెల్లూరులో అధికారుల అరాచకం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళాలు - ఇంటి పన్ను కట్టలేదని నెల్లూరులో ఇంటికి తాళాలు

House Tax: నెల్లూరులో ఇంటి పన్నులు చెల్లించడంలేదని అధికారులు ఇళ్లకు తాళాలు వేశారు. అప్పటికప్పుడు డిమాండ్ నోటీసులిచ్చి వెంటనే పన్నులు చెల్లించాలని యజమానులను కోరారు. దీంతో సీపీఎం నాయకుడు ప్రశ్నించడంతో వెంటనే తాళాలు తీశారు.

officers lock to houses for non payment of house tax
ఇంటి పన్ను కట్టలేదని ఇంటికి తాళాలు
author img

By

Published : Mar 22, 2022, 9:32 AM IST

Updated : Mar 22, 2022, 9:51 AM IST

House Tax: పన్నుల పేరిట నగర పాలక సంస్థల అధికారులు, సిబ్బంది ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. పన్నులు చెల్లించడం లేదని అధికారులు ఇళ్లకు తాళాలు వేయడం, సీజ్‌ చేయడం, కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటి చర్యలతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. నెల్లూరులో ఇంటి పన్నులు చెల్లించలేదంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్న ఘటన వెలుగుచూసింది.

నెల్లూరులో అధికారుల అరాచకం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళాలు

సోమవారం 11వ డివిజన్‌ ఎన్టీఆర్‌ నగర్‌లోని 10 ఇళ్లకు వెళ్లిన సిబ్బంది.. అప్పటికప్పుడు డిమాండ్ నోటీసులిచ్చి వెంటనే పన్నులు చెల్లించాలని యజమానులను కోరారు. ఒక్కో ఇంటికి 7 సంవత్సరాలకు గానూ 70,237 రూపాయలు చెల్లించాలని చెప్పారు. సీపీఎం నగర కమిటీ సభ్యుడు సూర్యనారాయణ, ఇతర నాయకులు సిబ్బందిని అడ్డుకుని ప్రశ్నించగా వారు వెనుదిరిగారు. ఇంటి పన్నులపై వడ్డీ మాఫీ చేసి వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌గా కట్టించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

నాటుసారా మృతుల కుటుంబాలకు.. తెదేపా పరిహారం అందజేత

Last Updated : Mar 22, 2022, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.