నెల్లూరులో 'లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక' జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీలు ఎ.ఎస్.లక్ష్మణ్ రావు, విఠపు బాలసుబ్రమణ్యం ఇతర జిల్లా నాయకులు హాజరయ్యారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలు అమలు చేయవద్దంటూ లక్ష్మణ్‌రావు డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. సంఘటితంగా పోరాడేందుకు లౌకిక పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 26న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తామన్నారు. అలాగే జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి రోజున గాంధీ విగ్రహాల వద్ద ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :