ETV Bharat / city

సీఎం సహాయ నిధి ఇప్పిస్తానంటూ మోసాలు...వ్యక్తి అరెస్ట్

సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవాళ్లే అతడి లక్ష్యం. సీఎం సహాయ నిధి నుంచి నగదు మంజూరు చేయిస్తానంటూ నమ్మిస్తాడు. మాయమాటలు చెప్పిన బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నాడు. సాయం చేయాల్సింది పోయి బాధితుల నుంచి డబ్బులు కొట్టేస్తున్న ఓ ప్రబుద్ధుడిని నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు.

Nellore police
Nellore police
author img

By

Published : Nov 21, 2020, 10:45 PM IST

సీఎం సహాయ నిధి మంజూరు చేయిస్తానంటూ మోసానికి పాల్పడిన ఓ మోసగాడిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. చికిత్స కోసం సాయం కోరుతూ సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థించే వారినే లక్ష్యంగా ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్​కు చెందిన షేక్ సైలాఫ్ తన కుమారుడి చికిత్సకు సాయం చేయాలని సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశారు. సీఎం సహాయ నిధికి కూడా దరఖాస్తు చేసుకున్నానని పోస్టులో తెలిపారు. ఈ పోస్టును చూసిన చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోటకు చెందిన సందీప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి షేక్​ సైలాఫ్​కి ఫోన్​ చేశాడు. తనకు సీఎం కార్యాలయ సిబ్బంది బాగా తెలుసని, రూ.10 వేలు అకౌంట్​లో వేస్తే, సీఎం రిలీఫ్ ఫండ్ త్వరగా మంజూరు చేయిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. బాధితుడి నుంచి రూ.ఆరు వేల నగదు వసూలు చేశాడు.

సైలాఫ్ కుమారుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో సందీప్ కుమార్ రెడ్డి మోసం బట్టబయలైంది. సందీప్ కుమార్ రెడ్డి తమకు తెలియదని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పడంతో మోసపోయానని గ్రహించిన సైలాఫ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన నవాబుపేట పోలీసులు సందీప్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ కుమార్ మరో ఇద్దరిని ఇదే విధంగా మోసగించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్​కు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరంలేదని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.