నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో పోలీసులు లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్ ద్వారానే సూళ్లూరుపేటలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇక్కడి పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. తర్వాత దుకాణాలు తెరవకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నాయుడుపేట క్వారంటైన్ సెంటర్ నుంచి ఈరోజు ముగ్గురిని నెల్లూరు తరలించారు. చెన్నై కోయంబేడు మార్కెట్‌కు రాకపోకలు సాగించే వారిని క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చూడండి ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం'