కొవిడ్ నియంత్రణలో భాగంగా వేస్తున్న వ్యాక్సినేషన్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 10 పీహెచ్‌సీల పరిధిలో 14 గ్రామ, వార్డు సచివాలయాల్లో నూరుశాతం వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. మొత్తం జనాభాలో 61.98 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశామని వివరించారు.
ఇదీ చదవండి : ACCIDENT: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి