ETV Bharat / city

కొయ్యకళాకారులకు కరోనా దెబ్బ

హాయిగా సేదదీరేందుకు కూర్చీలు.. పసివాళ్లు ఉయ్యాలలు... బల్లలు, పీటలు..! ఇలా చెక్కతో జీవనోపాధి పొందే వారి జీవితాలు కరోనా దెబ్బకు కళతప్పాయి. కచ్చితమైన సంపాదనంటూ ఏమీలేదు. ఏదో ఒక వస్తువు చెక్కితేగానీ పూట గడవదు. అలాంటిది.. 4 నెలలుగా అమ్మే పరిస్థితి లేక... కొనేవారూ కరవై... గుడిసెల్లో అర్ధాకలితో అలమటిస్తున్నారు.

కొయ్యకళాకారులకు కరోనా దెబ్బ
కొయ్యకళాకారులకు కరోనా దెబ్బ
author img

By

Published : Jul 12, 2020, 6:01 AM IST

Updated : Jul 12, 2020, 6:20 AM IST

కొయ్యకళాకారులకు కరోనా దెబ్బ

నాలుగు నెలలుగా కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో ప్రతీ రంగం చెల్లాచెదురైంది. ఉన్నవారు, లేనివారు అన్న వ్యత్యాసమే లేకుండా అందరి ప్రణాళికలను తారుమారు చేసిందీ మహమ్మారి. రోజువారీ వేతనాలు, ఆదాయంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితిని ఎంత వర్ణించినా తక్కువే! ఈ కోవలోకే వస్తారు నెల్లూరు జిల్లాలోని కొయ్య బొమ్మలు చేసే కళాకారులు.

అమ్ముడుకాని బొమ్మలు

నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, తడ, ఆత్మకూరు ప్రాంతాల్లో సుమారు 25 వేల కుటుంబాలు చెక్కపనిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు అడవుల నుంచి కొయ్యను కొట్టుకొస్తే... మరికొందరు వాటిని బల్లలు, కుర్చీలు, చెక్కబీరువాలు, పీటలుగా చెక్కుతారు. కడుపు నిండాలంటే ఏ రోజుకారోజు పని చేయాల్సిందే..! ఐతే కరోనా దెబ్బకు నాలుగు నెలలుగా చెక్కిన వస్తువులను అమ్ముకోలేక, అర్ధాకలితో అల్లాడుతున్నారు.

ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు

సాధారణ రోజుల్లో మగవారు వస్తువులు తయారు చేస్తే మహిళలు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి అమ్ముకుని వస్తుంటారు. ఇప్పుడు కరోనా భయంతో తమను కాలనీల్లో కనీసం అడుగుపెట్టనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా..! వీరున్న చోటే కొనుగోలు చేసేందుకు ఎవరూ సాహసించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులోళ్ల ఆగడాలను భరిస్తూ పిల్లల ఆకలి ఏడ్పులు వింటూ దుర్భర జీవితం గడుపుతున్నారు.

లాక్‌డౌన్ సమయంలో కార్మికులను ఆదుకున్న ప్రభుత్వం తమకూ ఎంతోకొంత ఆర్థిక సహాయం చేయాలని కొయ్యపనివారు కోరుతున్నారు. అప్పు వనూలు కోసం వచ్చే వడ్డీవ్యాపారులను కట్టడి చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : ఇంటిపై కప్పు కూలి ఇద్దరు మృతి

Last Updated : Jul 12, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.