Mustapur villagers protest: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని ముస్తాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విద్యుత్ బిల్లులు కట్టబోమని స్పష్టం చేశారు. తమ గ్రామాన్ని ఆత్మకూరు మున్సిపాలిటీలో కలిపారని.. పురపాలిక పరిధిలో అందాల్సి సేవలు అందడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ఏడాది నుంచి లైన్మెన్, హెల్పర్ కూడా లేడని వాపోయారు. గ్రామంలో ఏ విద్యుత్ సమస్య వచ్చినా తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. పొలాల్లో విద్యుత్ వైర్లు తెగిపడినా పట్టించుకునే నాథుడే లేడని తెలిపారు. సమస్యలను విద్యుత్‌శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని.. అందుకే విద్యుత్ బిల్లులు కట్టకుండా బహిష్కరించామని గ్రామస్థులు చెప్పారు. సమస్యలు పరిష్కరించే వరకు బిల్లులు చెల్లించేది లేదని స్పష్టం చేయడంతో... విద్యుత్ సిబ్బంది వెనుదిరిగారు.
ఇవీ చదవండి: