Muslims Protest In Nellore: వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసగిస్తోందని ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ జియా ఉల్ హక్ ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా.. ముస్లింలకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముస్లిం ప్రజాప్రతినిధులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దుల్హాన్, విదేశీ విద్య, ఇస్లామిక్ బ్యాంక్, వృత్తి విద్య నైపుణ్య శిక్షణ కేంద్రాలు లాంటివేమి ఈ ప్రభుత్వం అమలు చేయడంలేదని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు 5,577 మంది లబ్ధిదారులకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసిందని చెప్పారు.
ఇదీ చదవండి: కల్తీసారా మృతుల కుటుంబాలతో.. రహస్య విచారణ!