అస్వస్థతకు గురై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
పశ్చిమ బంగ నుంచి వచ్చిన 49 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారని.. వారందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాలకు తాగునీటిలో ఏదైనా కెమికల్ కలిసిందేమోనని.. వాటిని పరీక్షలకు పంపించామని చెప్పారు. నివేదిక వచ్చాక అసలు కారణాలు తెలుస్తాయన్నారు.
ఇవీ చదవండి..