నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని హరనాధపురం దగ్గర 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. హరనాధపురం దగ్గర ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపి కేంద్రం నుంచి అనుమతి పొందామన్నారు. డిజైన్ ప్లాన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. నగరంలో మరో రెండు ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే నగరంలో 450 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.
ఇదీ చదవండి