నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో కోతుల బెడదకు గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళలపై కోతుల మంద దాడి చేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో ఈ గ్రామంలో సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు కోతుల దాడిలో గాయాలపాలయ్యారు.
గ్రామంలో ఉండాలంటే తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానరుల భయంతో తమ పిల్లలను స్కూలుకు పంపించడం లేదంటున్నారు. ఇంట్లో అన్నం వండాలన్నా... ఏదైనా తినాలన్నా.. కోతుల దెబ్బకు భయపడుతున్నామన్నారు. చివరికి గ్రామంలోకి కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లూ రావడం మానేశారని తెలిపారు. కోతుల బారి నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: