నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురిస్తోంది. రహదారులపై వాన నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరులో రాత్రి నుంచి కురుస్తున్న(Rain falling in atmakur) వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు... జేసీబీ సహాయంతో చెరువులకు గండి కొట్టి వరద నీటిని దిగువ ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన జరుగుతున్న సమయంలోనే వర్షం ముంచెత్తింది.
అనంతసాగరంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరికతో అనంతసాగరం బస్టాండ్ వద్ద కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. వర్షంలోనే నిరసనకు దిగారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 96,107, ఔట్‌ఫ్లో 88,052 క్యూసెక్కులుగా ఉంది. జలాశయానికి ఇంకా భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున.. పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదీచదవండి.