Kidnap case chased in Nellore : నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం బృందావనం కాలనీలో అపహరణకు గురైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. చాముండేశ్వరి ఆలయం సమీపంలో మూడేళ్ల బాలికను ఇద్దరు మహిళలు నిన్న(ఆదివారం) కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇందుకూరుపేట మండలం కాలమూల కండ్రిగకు చెందిన తల్లీకూతుళ్లే బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి కిడ్నాప్...
ఇందుకూరుపేట మండలం గంగపట్నం బృందావనం కాలనీలో ఆదివారం మూడేళ్ల చిన్నారి పల్లవి అపహరణకు గురైంది. బృందావన కాలనీకి చెందిన మానికల శులామయ్య, పోలమ్మకు అయిదుగురు సంతానం. ఈ చిన్నారి తల్లిదండ్రులు ఆదివారం స్థానిక చాముండేశ్వరి ఆలయంలో పనికి వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న మూడేళ్ల ఈ బాలిక ఆడుకుంటుండగా... గుర్తు తెలియని ఇద్దరు యువతులు ఓ ద్విచక్రవాహనంపై వచ్చి పండ్లు ఇస్తామని ఆశ చూపించారు. ద్విచక్రవాహనం దగ్గరకు వచ్చిన చిన్నారిని వెంటనే మధ్యలో కూర్చొబెట్టుకుని అక్కడ నుంచి పరారయ్యారు.
వీరికి మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ వై.హరినాథరెడ్డి దగదర్తి, బుచ్చి, నెల్లూరు పోలీసులను ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... ఇద్దరు యువతుల కోసం గాలించారు. టవర్ డంప్ ద్వారా ఆ ప్రాంతంలో ఎవరెవరు ఫోన్‌లో మాట్లాడారనేది పరిశీలించారు.
ఇవీచదవండి.