ETV Bharat / city

నెల్లూరులో పట్టపగలే దారుణం.. కత్తులతో యువకుడిపై దాడి - నెల్లూరులో పట్టపగలే కత్తులతో దాడి

Murder Attempt at Nellore: నెల్లూరు నగరం ఉల్లిక్కి పడింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై కత్తులతో దారుణంగా పొడిచి పరారయ్యారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

నెల్లూరులో హత్యాయత్నం
murder attempt on a man at nellore town
author img

By

Published : May 26, 2022, 6:04 PM IST

Nellore Crime News: నెల్లూరు నగరంలో పట్టపగలే దారుణం జరిగింది. జనం రద్దీగా ఉండే టౌన్ హాల్ ఎదురుగా దండువారి వీధిలో విజయ్​(21) అనే వ్యక్తిపై ముగ్గురు యువకులు కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తం మడుగులో ఉన్న అతన్ని స్థానికులు, స్థానిక వన్​టౌన్​ సీఐ వీరేంద్రబాబు సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పట్టపగలే నగరం నడిబొడ్డున ఈ ఘటన జరగడంతో జిల్లాలో కలకలం రేగింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన వన్​టౌన్​ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలో ఆధారంగా నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. దాడికి గురైన యువకుడు విజయ్.. పట్టణలోని మనుమసిద్ధి నగర్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎవరితోనూ పెద్దగా విభేదాలు లేనప్పటికీ.. ఈ దారుణం జరగడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షల వల్ల ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరేంద్రబాబు చెప్పారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.