ETV Bharat / city

తుంగభద్ర పుష్కరాల పనులు పూర్తయ్యేనా..?

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జీవనది పండగ. సంవత్సర కాలం ముందు నుంచే దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేయలేదు. రెండు నెలల ముందు అప్పటికప్పుడు మంత్రులు, అధికారులు సమీక్షలు జరిపి నిధులు కేటాయించారు. టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించేసరికి సమయం ముంచుకొచ్చింది. దీంతో నాణ్యత పక్కనబెట్టి హడావుడిగా నిర్మాణాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. తుంగభద్ర పుష్కరాలకు కేవలం తొమ్మిది రోజులుండగా పనులు పూర్తిచేయడం ప్రశ్నార్థకంగా మారింది.

Tungabhadra pushkaralu
Tungabhadra pushkaralu
author img

By

Published : Nov 13, 2020, 5:13 PM IST

కర్నూలు జిల్లాలో పుష్కరాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకు నిధులు మంజూరు అయ్యాయి. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 56 పనులు రూ.30 కోట్లు, ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిధిలో 36 పనులకు రూ.126 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో సీసీ, తారు రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరోడ్డు పూర్తి కాలేదు. మరోవైపు ఆర్‌అండ్‌బీ శాఖ కర్నూలు నగరంలో రాత్రి సమయాల్లో పనులు చేస్తున్నారు. గ్రామీణ, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. తుంగభద్ర నది పరిధిలో అధిక వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ముందుగా మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని భావించినా.. ఆచరణలో అమలు కావడం లేదు. పనులను బట్టి గుత్తేదార్లకు సమయం ఇచ్చారు. కాంట్రాక్టు దక్కించుకున్న వారిలో కడప, నెల్లూరు, విజయవాడ, స్థానిక గుత్తేదారులు ఉన్నారు.

రహదారుల పనులు పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన గడువు ఈ నెల 15 వరకే. క్షేత్రస్థాయిలో పనులు చూస్తే పుష్కరాలకు రోడ్లు అందుబాటులోకి వచ్చేలా లేవు. ఒకవేళ రోడ్లు పూర్తి చేయకపోతే ట్రాఫిక్‌ సమస్య వేధించే అవకాశాలున్నాయి. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు కాగా, ఇంకా పనులు ప్రారంభం కాలేదు. మిడుతూరు మండలం చెరుకుచెర్ల బాట నుంచి పారుమంచాల వరకు ఉన్న పాత బీటీ రోడ్డును తవ్వి రోలింగ్‌ చేసి వదిలిపెట్టారు. జూపాడుబంగ్లా మండల పరిధిలో తరిగోపుల రహదారి గుంతల మయంగా మారింది. పుష్కర నిధులు రూ.80 లక్షలతో నూతన రహదారి వేయాల్సి ఉన్నా ఇంత వరకు ప్రారంభమే కాలేదు. గూడూరు-పెంచికలపాడు రోడ్డు ప్రస్తుతం ఒకవైపు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకా తారు పనులు మొదలు పెట్టలేదు.

రోడ్ల పనులు చేపట్టిన గుత్తేదారులకు కంకర సమస్య తెర మీదకు వచ్చింది. సకాలంలో సరఫరా లేక పనులు ముందుకు సాగడం లేదు. కంకర కొరతపై జిల్లా సర్వోన్నతాధికారి దృష్టికి వెళ్లగా స్పందించి క్రషర్ల యాజమాన్యం, మైనింగ్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ జయరామిరెడ్డి ‘తెలిపారు. కంకర డిమాండ్‌ పెరగడంతో కొందరు క్రషర్ల యాజమాన్యం ధరలను సైతం పెంచేశారు.

ఇదీ చదవండి

సాయం కోరుతూ వచ్చాడు... సెల్​ఫోన్ ఎత్తుకెళ్లాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.