ETV Bharat / city

రాయలసీమలో వర్షాలు-రైతుల్లో ఆనందం - రాయలసీమలో వర్షాలు

రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రహదారులు కోతకు గురైయ్యాయి.దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

rain-in-rayalaseema
author img

By

Published : Sep 23, 2019, 11:44 AM IST

రాయలసీమలో వర్షాలు-రైతుల్లో ఆనందం

రాయలసీమ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. కరవు జిల్లా అనంతపురంలో కురిసిన వర్షానికి చెరువుల్లోకి నీరు చేరింది. గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో వాగులు నిండుగా ప్రవహించాయి. కరవు నేలలోకి నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా హొళగుంద, హాలహర్వి మండలాల్లో కురిసిన వర్షాలకు... రహదారుల మీద నీరు చేరింది. నిర్మాణంలో ఉన్న ఓకల్వర్టు ప్రవాహానికి కొట్టుకుపోయింది. హొళగుంద, ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బళ్లారి-కర్నూలు రహదారి కోతకు గురై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాలహర్వి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వర్షం నీరు చేరి సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

గాంధీ 150: బాపూను వైఫల్యం పలకరించిన క్షణం!

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
శివకాంత్(EJS)
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_23_Awarness_Millets_AV_AP10004

Body:అనంతపురం జిల్లా కదిరిలో అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం అనే అంశంపై చిరుధాన్యాల సాగు నిపుణుడు ఖాదర్ వలీ రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. రసాయనిక ఎరువులు పురుగు మందుల విచ్చలవిడి వినియోగం వల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అతివృష్టి అనావృష్టి సంభవిస్తున్నాయన్నారు. రైతులు అధిక దిగుబడి సాధించాలన్నా ఆశతో వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. సిరిధాన్యాల సాగు వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.