ETV Bharat / city

Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర - ఏపీ తాజా వార్తలు

Bharat Jodo Yatra: ఇవాళ కర్నూలు జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ఉదయం 7 గంటలకు హాలహర్విలో ప్రారంభమైన రాహుల్ యాత్ర... హత్తిబెలగళ్‌ వద్ద ముగిసింది. సాయంత్రం తిరిగి హత్తిబెలగళ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.

Bharat Jodo Yatra
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర
author img

By

Published : Oct 18, 2022, 8:01 AM IST

Updated : Oct 18, 2022, 10:11 AM IST

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ఇవాళ కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. హాలహర్వి బస్టాండ్‌ వద్ద ఉన్న రామాలయం నుంచి ఉదయం 7 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. ఆలూరు సమీపంలోని హత్తిబెలగళ్‌ వద్ద ముగించారు. హత్తిబెలగళ్​ చేరుకున్న రాహుల్​ విరామం తీసుకుంటున్నారు. సాయంత్రం తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మునికుర్తి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి ఆదోని మండలం చాగి గ్రామంలో రాహుల్ బస చేస్తారు. రాహుల్​ జోడో పాదయాత్ర రాష్ట్రంలో ఈనెల 21 వరకు కొనసాగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 18, 2022, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.