కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపిన తర్వాతే నూతన వ్యవసాయ చట్టాలపై నిర్ణయం తీసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్ అన్నారు. రోజురోజుకు రైతుల ఆందోళనకు మద్దతు పెరుగుతుందన్నారు.
అనంతపురం జిల్లా:
కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అనంతపురంలో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రైతు సంఘాల సమన్వయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పద్దెనిమిది రోజులుగా దిల్లీలో రైతులు దీక్ష చేస్తుంటే కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయటానికే కేంద్రం ఉందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష, అఖిలపక్ష పార్టీలు రైతులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: