Oxygen Plant Gifted To Kurnool General Hospital: కరోనా మొదటి దశ, రెండో దశ సమయంలో.. ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధించింది. ప్రాణవాయువు కొరత కారణంగా ఎంతోమంది రోగులు విగతజీవులయ్యారు. మళ్లీ కొవిడ్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో.. సొంత జిల్లా కర్నూలులో రూ.22 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది మాదిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం.
కర్నూలు సర్వజన వైద్యశాలలో కేంద్ర ప్రభుత్వం వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా అమెరికాలో స్థిరపడిన కర్నూలు జిల్లాకు చెందిన మాదిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం.. "ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్" పేరుతో మరో ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చింది.
కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మాదిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడింది. అయితే.. తమ సొంత జిల్లాకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో బంధువులు, స్నేహితుల సూచన మేరకు సుమారు 22 లక్షల రూపాయలతో ఈ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
కరోనా సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. కాగా.. గ్రీనో కో సంస్థ ఒక ప్లాంట్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరో ప్లాంట్ ను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇవి కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చదవండి..
Kadapa RIMS: కడప రిమ్స్‌లో కరోనా కలకలం.. 50 మంది విద్యార్థులకు పాజిటివ్