కర్నూలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. రెండ్రోజుల క్రితం కమిషనర్ రవీంద్ర బాబును ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. అనారోగ్య కారణాల రీత్యా తనను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రవీంద్రబాబు. దీనివల్ల ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి బాలాజీని ప్రభుత్వం నియమించింది. కరోనా కట్టడికి కృషి చేస్తానని కొత్త కమిషనర్ బాలాజీ తెలిపారు. మరోవైపు కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. శనివారం ఉదయానికి మొత్తం 436 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాలాజీ బాధ్యతలు - కర్నూలు నగరపాలక సంస్థ వార్తలు
కర్నూలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి బాలాజీ బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర బాబు బదిలీకావటంతో ఆయన స్థానంలో బాలాజీని ప్రభుత్వం నియమించింది. కరోనా వ్యాప్తి నివారణకు కృషిచేస్తానన్నారు నూతన కమిషనర్.
![కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాలాజీ బాధ్యతలు new Commissioner of kurnool municipal corporation Balaji takes charges](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7029868-572-7029868-1588418345837.jpg?imwidth=3840)
new Commissioner of kurnool municipal corporation Balaji takes charges