ETV Bharat / city

శ్రీశైలంలో నూతన భవన సముదాయం.. తీరనున్న వసతి కష్టాలు - శ్రీశైలంలో రూపుదిద్దుకుంటున్న నూతన వసతి సముదాయం

శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం కోసం నూతన వసతి సముదాయం రూపుదిద్దుకుంటోంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న భవన సముదాయాన్ని వచ్చే ఆగస్ట్​ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నూతన సముదాయం పూర్తైతే భక్తులకు వసతి కష్టాలు తీరనున్నాయి.

శ్రీశైలంలో రూపుదిద్దుకుంటున్న నూతన వసతి సముదాయం
శ్రీశైలంలో రూపుదిద్దుకుంటున్న నూతన వసతి సముదాయం
author img

By

Published : Dec 20, 2019, 6:44 PM IST

నూతన వసతి సముదాయంతో తీరనున్న వసతి కష్టాలు

కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు నూతన వసతి సముదాయాన్ని నిర్మిస్తున్నారు. గణేష్​ సదన్​ పేరిట దాదాపు రూ.43 కోట్లతో నాలుగు బ్లాక్​ల్లో 224 గదుల నిర్మాణం సాగుతోంది. వసతి సముదాయంలోని సీ బ్లాక్​లో రిసెప్షన్, రెస్టారెంట్ సదుపాయాలు కల్పించనున్నారు. వాహనాల పార్కింగ్​ కోసం ఐదెకరాలు స్థలాన్ని కేటాయించారు. అంతర్గత రహదారులు, పచ్చని చెట్లను పెంచి పార్కింగ్​ను తీర్చిదిద్దనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కావడం వల్ల దేశం నలుమూలల నుంచి శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ నూతన సముదాయంతో యాత్రికుల వసతి కష్టాలు తీరనున్నాయి.

దాతలకు 45 రోజులు వసతి ఉచితం

నూతన వసతి సముదాయంలో ఒక్కో గదికి దాతలు రూ.10 లక్షల విరాళం ఇవ్వాలని దేవస్థానం అధికారులు కోరారు. విరాళం ఇచ్చిన దాతకు ఏడాదిలో 45 రోజులు ఉచితంగా వసతి కల్పించనున్నారు. దాత తరఫున వచ్చే వారికి నామమాత్రం రుసుముతో వసతి కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

జగన్​కు ఓట్లేసి మోసపోయాం: వైకాపా కార్యకర్తలు

Intro: శ్రీశైలంలో భక్తుల వసతి కోసం నూతన వసతి సముదాయం రూపుదిద్దుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వసతి సముదాయాన్ని వచ్చే ఆగస్ట్ నాటికి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులు సమాయత్తం అవుతున్నారు.ఈ నూతన సముదాయం పూర్తి అవుతే భక్తులకు వసతి కష్టాలు తిరనున్నాయి.

Body:ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. సాధారణ రోజుల్లో 30వేలు, వారాంతాల్లో 60 వేల మంది భక్తులు శ్రీశైలానికి వస్తున్నారు. కార్తీకమాసం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు మల్లన్న సన్నిధికి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రింగ్ రోడ్డుకు అనుకొని దేవస్థానం రూ. 43 కోట్లతో 224 గదులను నాలుగు బ్లాక్ లుగా సముదాయాన్ని నిర్మిస్తోంది. సి బ్లాక్ లో రిసెప్షన్, రెస్టారెంట్ సదుపాయాలు కల్పించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అంతర్గత రహదారులు, పచ్చని చెట్లను పెంచి పార్కింగ్ ను తీర్చిదిద్దనున్నారు. నూతన వసతి సముదాయంలో ఒక్కో గదికి రూ.10 లక్షల విరాళం ఇవ్వాలని దేవస్థానం కోరుతోంది. విరాళం ఇచ్చిన దాతకు ఏడాదిలో 45 రోజులు ఉచితంగా వసతి కల్పించనున్నారు.దాత తరపున వచ్చే వారికి నామమాత్రం రుసుముతో వసతి గది కేటాయించనున్నారు.

Conclusion:భక్తజన సౌధంగా నిర్మించే గణేష్ సదన్ నిర్మాణం లో భక్తులు భాగస్వామ్యం కావాలని అధికారులు కోరుతున్నారు. నూతన సముదాయంలో విలాసవంతమైన వసతి, రెస్టారెంట్ అన్ని భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఆగస్ట్ నాటికి గణేష్ సదన్ పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానుంది.

బైట్స్ 1) మహేష్,భక్తుడు
2) వెంకట సుబ్బయ్య,భక్తుడు
3) కె.ఎస్. రామారావు, ఈఓ, శ్రీశైల దేవస్థానం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.