కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్థర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 2వ తేదీన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. కరోనా సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులతో కలిసి పరీక్షలు చేయించుకున్నారు.
పరీక్షల్లో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మనవడికి సైతం పాజిటివ్ అని తేలింది. చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సామాజిక మాధ్యమంలో ఎమ్మెల్యేనే స్వయంగా ప్రకటించారు. ప్రజలు కరోనా బారినపడకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు.
ఇదీ చదవండి: