కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పలు వార్డుల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వైకాపా ఛైర్మన్ అభ్యర్థి రఘు ప్రచారంలో పాల్గొని తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.
తెదేపా ప్రచారం
అభివృద్ధి అంటే సైకిల్ .. సైకిల్ అంటే అభివృద్ధి అని కర్నూలు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ భాద్యుడు టీజీ.భరత్ అన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 11,12 వ వార్డుల్లో ఇంటింటికి తిరిగి తెదేపా అభ్యర్ధికి ఓటు వేయాలని కోరారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ఓటు హక్కు ఉన్నవారందరు ఓటు హక్కును వినియోగించాలని భరత్ కోరారు.
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రచారం..
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటే ధ్యేయంగా పని చేస్తామనే హామీతో అనంతపురం వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. 9వ డివిజన్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం ప్రారంభించిన ఆయన జిల్లా ప్రజలకు డ్రైనేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వైకాపా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: