ETV Bharat / city

రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయండి: టీజీ

రాయలసీమలో రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. పాలకులందరూ రాయలసీమను అభివృద్ధి చేయటంలో విఫలమయ్యారని విమర్శించారు.

రాయలసీమలో రాజధానిని, హైకోర్టు చేయండి: ఎంపీ టీజీ వెంకటేష్
author img

By

Published : Oct 1, 2019, 11:56 PM IST

రాయలసీమలో రాజధానిని, హైకోర్టు చేయండి: ఎంపీ టీజీ వెంకటేష్

రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలులో డిమాండ్ చేశారు. రాయలసీమలో ఎలాంటి అభివృద్ది జరగలేదని... సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాజధాని, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే ఒక్క రూపాయి సైతం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు .కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కర్నూలులో ఓ పెద్ద ప్రాజెక్టు రాబోతున్నట్లు ఎంపీ తెలిపారు.

ఇవీ చూడండి-చిలకలూరిపేటలో పేలుడు... టపాసుల తయారీనే కారణమా !

Intro: వాయిస్ ఓవర్ చేసి పంపిన ఐటమ్

kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం,
సెల్.9299999511

అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె ప్రజలు విద్యుత్ కోతలతో తల్లడిలుతున్నారు. గత 8 రోజుల నుండి రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మండల కేంద్రాలు ఘంటశాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయి.

ఒక వైపు వరదలు వచ్చి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు విద్యుత్ సమస్య వచ్చిపడింది. మరోప్రక్క గ్రామాల్లో ఇప్పటికే నూటికి 60 మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వరాలకు చికిత్సకోసం ఇప్పటికే అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నామని అవనిగడ్డ మండలం, పులిగడ్డ శివారు పల్లెపాలెం గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ లేక పోవడం వలన దోమలు విపరీతంగా కుట్టడంతో అనారోగ్యం పాలు అవుతున్నామని తెలిపారు.
వృద్ధులు, చిన్నపిల్లలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిరాణా షాపులు, పాల కేంద్రాలు, ఇతర చిల్లర వర్తకులు క్యాండిల్ వెలుగులోనే తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. దోమల భాద తట్టుకోలేక గ్రామాల్లో రోడ్డుపైకి వచ్చి రోడ్డు మీద నడుస్తుంటే పాములు కరుస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పల్లెటూరిలో ప్రజలు పనుల కోసం పగలు అంతా పొలంలో ఉండి రాత్రి ఇంటికి వచ్చి వంట పనులు చేసుకునే సమయానికి విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

మండల కేంద్రాలలో విద్యుత్ కోతలు లేకుండా కేవలం పల్లెటూరి గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయడం దారుణమని అంటున్నారు.

పామర్రు నుండి అవనిగడ్డలో ఉన్న 133 కెవి సబ్ స్టేషన్ కు ఫోన్ ద్వారా మెసేజ్ రాగానే సదరు సిబ్బంది 33 కెవి సబ్ స్టేషన్లకు ఫోన్ చేసి రూరల్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఫోన్ కాల్ ద్వారా చెప్పడంతో విద్యుత్ నిలిపివేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ వినియోగ దారులకు విద్యుత్ కోతల సమాచారం తెలుపకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాయిస్ బైట్స్

పులిగడ్డ గ్రామస్తులు

Body:వాయిస్ ఓవర్ చేసి పంపిన ఐటమ్

Conclusion:వాయిస్ ఓవర్ చేసి పంపిన ఐటమ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.