ETV Bharat / city

చివరి దశలో పంటకు అందని నీళ్లు.. కేసీ కెనాల్‌ రైతుల ఆందోళన - kc canal water level

చివరి దశలో పంటకు నీళ్లు అందక కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల ఆందోళన చెందుతున్నారు. నీటి తడులు చాలినంతగా అందకముందే కాలువ నుంచి నీటి ప్రవాహాన్ని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పంటకూ నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

kc canal farmers demand to water
చివరి దశలో పంటకు అందని నీళ్లు
author img

By

Published : Jan 11, 2021, 8:03 AM IST

డప - కర్నూలు కాలువ (కేసీ కెనాల్‌) కింద ఆయకట్టుకు చాలినంత నీరు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. జల వనరులశాఖ కార్యాలయాలకు వెళ్లి ఆందోళన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మల్యాల నుంచి రెండు పంపుల ద్వారా 674 క్యూసెక్కులు, ముచ్చుమర్రి పథకం నుంచి ఒక పంపు ద్వారా 250 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు - బనకచర్ల ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అది చాలదని రైతులు అంటున్నారు. కేసీ కాలువ కింద ఖరీఫ్‌లో వేసిన పంటల సాగు ఇంకా పూర్తి కాలేదు.

kc canal farmers demand to water
కేసీ కాలువ

భారీ వర్షాలవల్ల మొదట్లో వేసిన పంటలో 63వేల ఎకరాల వరకు నష్టపోయారు. అక్కడి రైతులు సెప్టెంబరు నుంచి సాగు చేస్తున్నారు. మిగిలిన దాంట్లోనూ కొంత పంట ఇంకా చేతికి రాలేదు. ఈ ఆయకట్టుకు చివరి దశలో నీటి తడులు చాలినంత అందకముందే కేసీ కాలువ నుంచి నీటి ప్రవాహాలను తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు నాయకులు తాము నీళ్లు ఇప్పిస్తామని చెప్పడంతో అనేకచోట్ల రైతులు రెండో పంట వేశారు.

ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగుచేసిన ఆయకట్టుకు, రెండో పంటగా సాగుచేసే ఆయకట్టులో ఇప్పటికే నాట్లు వేసిన 50వేల ఎకరాలకు నీటి అవసరం ఏర్పడింది. ఇదే కాకుండా ఖరీఫ్‌లో తాము పంటలు నష్టపోయినందున శ్రీశైలం నుంచి తమకు నీరు ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. రెండోపంటకు పూర్తిగా నీరందిస్తామన్న భరోసా ఇవ్వలేమని, బోర్లపై ఆధారపడేవారు సొంత బాధ్యతతోనే సాగు చేసుకోవచ్చని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు.

కర్నూలు, కడప జిల్లాల నీటి డిమాండుపై ఇప్పటికే ఈఎన్‌సీకి కర్నూలు జల వనరులశాఖ అధికారులు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలవల్ల సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనూ పంటలు వేశారని, వాటికి నీటి అవసరం ఉందని కర్నూలు ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి ఈఎన్‌సీకి డిసెంబరు చివర్లోనే లేఖ రాశారు. చేతికి వచ్చిన పంట నష్టపోయే పరిస్థితి ఉన్నందున సుంకేశుల నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

తుంగభద్ర నుంచి తమ వాటా కింద మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డును కోరాలంటూ ఎస్‌ఈ విన్నవించారు. రోజుకు 4000 క్యూసెక్కుల చొప్పున ఆరు రోజుల పాటు సుంకేశులకు నీరు విడుదల చేస్తే పంటలు కాపాడటం వీలవుతుందని కోరారు. కర్నూలు సీఈ సైతం వేసవి వరకు కర్నూలు, కడప జిల్లాల డిమాండును పేర్కొంటూ ఈఎన్‌సీకి లేఖ పంపారు. కర్నూలు, కడప జిల్లాలకు మార్చి నెలాఖరు వరకు 22 టీఎంసీల నీరు అవసరమని తెలిపారు. ఇంకా వీటిపై నిర్ణయాలు తీసుకోలేదు. మంగళవారం కృష్ణాబోర్డు సమావేశం ఉన్నందున అందులో చర్చించి కేసీ కెనాల్‌ ఆయకట్టుకు తగినంత నీరు విడుదల చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.