కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయ పురవీధుల్లో కార్తిక దీపారాధనలు చేశారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు బారులు తీరి కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులు స్వామి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగనుంది.
శ్రీశైలంలో వైభవంగా 'కార్తిక పౌర్ణమి' - kurnool news
కార్తిక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంభిక మల్లికార్జునస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.