'తమ కార్యకర్తల పై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు' - Rekha is the Chairman of Janasena State Women's Authority
జనసేన కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర మహిళాసాధికారత ఛైర్మన్ రేఖ అన్నారు. కర్నూల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. బేతంచర్లకు చెందిన చల్లా మద్దిలేటి అనే యువకుడి పై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి తీసుకెళ్లారని, అరెస్టు చూపించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడి... తమ కార్యకర్తలను భయందోళనకు గురిచేస్తున్నారని జనసేన నాయకులు అన్నారు.