ETV Bharat / city

కర్నూలు జిల్లాలో భారీ వర్షం... పొంగుతున్న వాగులు - కర్నూలు జిల్లాలో వర్షాల వార్తలు

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల ధాటికి వాగులు, వంకలు పొంగుతున్నాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంజీవయ్య ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తటంతో.. అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.

sanjeevayya project
సంజీవయ్య ప్రాజెక్ట్
author img

By

Published : Oct 1, 2020, 8:22 AM IST

Updated : Oct 1, 2020, 10:10 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె సంజీవయ్య ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయంలోకి ఇన్ ఫ్లో 22వేల క్యూసెక్కులు ఉండగా 2 గేట్లు ఎత్తి దిగువకు 21 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మండలంలోని మల్లెల వాగు పొంగి ప్రవహించటంతో గంజాహళ్లి-బైలుప్పుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కర్నూలు జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. కర్నూలు, డోన్‌, ఓర్వకల్లు, పత్తికొండ, కృష్ణగిరి ప్రాంతాల్లో వాన పడింది. వరద నీటితో కర్నూలులోని హంద్రీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.... వక్కెర వాగు పొంగిపొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 1,50,978 క్యూసెక్కులు ఉండగా.. ఔట్​ఫ్లో 1,42,930 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.

కృష్ణగిరి మండలం కంబాలపాడు వంక వద్ద వంతెనపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల మండలం గంజహళ్లిలో మల్లెలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

దేవనకొండ మండలం కరివేముల-తెర్నేకల్ రహదారిలో వాగు ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. అందులోని వారిని స్థానికులు కాపాడారు. దేవరకొండ చెరువులో కొట్టుకుపోతున్న మరో బాలుడిని రక్షించారు.

ఇవీ చదవండి..

హథీరాంజీ మఠంలో బంగారు ఆభరణాలు మాయం: అర్జున్ దాస్

Last Updated : Oct 1, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.