కర్నూలు జిల్లా పరిధిలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్ ముస్తాక్ హాక్ అనే వ్యక్తి... ఆర్టీసీ బస్సులో తెలంగాణ రాష్ట్రం గద్వాల నుండి కర్నూలుకు 1కేజీ 447 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొస్తుండగా సెబ్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సును తనిఖీ చేశారు.
ఆ ఆభరణాలకు సంబంధించి ఎటువంటి రశీదులు, ఆధారాలను షేక్ ముస్తాక్ చూపించకపోవడంపై.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును తాలూకా పోలీసు స్టేషన్ కు అప్పగించారు.
ఇదీ చదవండి: