Arrest in bike theft case: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో ఇళ్ల ముందు, రహదారుల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు.
హనుమంతు, వడ్లవీరేశ్, రంగయ్య నాయుడు, గొల్ల రామచంద్ర అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి:
'వాళ్లు ఆగం చేశారు.. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా'