ETV Bharat / city

ఇంజినీరింగ్‌ అద్భుతం శ్రీశైలం ప్రాజెక్టు - srisialam fire accident

బయటి నుంచి చూస్తే పచ్చందాలతో ఆహ్లాద వాతావరణాన్ని పంచుతూ పెద్ద కొండ.. దానికి ఓ వైపు నుంచి సొరంగం.. అందులోకి వాహనంలో కిలోమీటరుకుపైగా దూరం వెళ్తే లోపల విద్యుత్తు కేంద్రం. ఆ సొరంగంలోపలికి వెళ్లిన వారికి అక్కడున్న భారీ విద్యుత్తు కేంద్రం చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. దానిలోపల భారీ విద్యుత్తు కేంద్రం ఉందంటే.. కొండ బయటి నుంచి చూసేవారెవరూ నమ్మరు. కానీ, ఇంజినీర్లు తమ ప్రతిభను జోడించి అద్భుతంగా నిర్మించిన శ్రీశైలం విద్యుత్తు కేంద్రం లోపలికి వెళ్లి చూస్తే నమ్మకతప్పదు.

Engineering Awesome srisailam project
ఇంజినీరింగ్‌ అద్భుతం శ్రీశైలం ప్రాజెక్టు
author img

By

Published : Aug 22, 2020, 10:23 AM IST

భూగర్భంలో ఎప్పుడూ 20 మంది విధుల్లోనే..

శ్రీశైలం ప్రాజెక్టు లోపలికి వెళ్లిన తరవాత భూగర్భంలోకి లిఫ్ట్‌లో 4 అంతస్తులు(72 మీటర్లు) కిందకు దిగాలి. రిజర్వాయర్‌ నుంచి అతివేగంగా వచ్చే కృష్ణాజలాలు టర్బైన్‌పై పడితే.. అవి తిరగడం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడూ కనీసం 10 మంది అధికారులు, మరో 10 మంది ఇతర సిబ్బంది ఈ భూగర్భంలో రోజంతా(24 గంటలూ) విధుల్లో ఉంటారు. ఓ ఉప ఇంజనీరు(డీఈ), మరో ఇద్దరు సహాయ డీఈలు, ఐదుగురు సహాయ ఇంజినీర్ల(ఏఈల)తో పాటు సహాయ సాంకేతిక సిబ్బంది, అటెండర్లు ఒక్కో షిఫ్టులో పనిచేస్తుంటారు. .

ఏడాదిలో 3, 4 నెలలే విద్యుదుత్పత్తి
సాధారణంగా కృష్ణానదిలో వరదలు ఎక్కువగా ఉంటేనే ఈ కేంద్రంలో జల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఇక్కడ ఏడాదిలో గరిష్ఠంగా 3, 4 నెలలకు మించి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి గతేడాదే(2019-20)లోనే ఈ కేంద్రంలో అత్యధికంగా 1,993 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుదుత్పత్తి జరిగింది.

విచారణకు ఆదేశం
విద్యుదుత్పత్తి లేని సమయంలో ఏటా 15 రోజుల పాటు ప్లాంట్లకు మరమ్మతు చేస్తారు. ఆ సమయంలో ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, చెడిపోయిన పరికరాలను మార్చేస్తారు. దీంతోపాటు వారానికోమారు అన్ని విభాగాలను పరిశీలిస్తుంటారు. అయినా, ప్యానల్‌ బోర్డులో మంటలు రావడానికి కారణాలు తెలియక విద్యుత్‌ సీనియర్‌ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్లాంటులోపలికెళ్లి ప్రతీ విభాగాన్ని పరిశీలిస్తే తప్ప మంటలు రావడానికి కారణాలు తెలియవని వారు పేర్కొంటున్నారు. ఈ సంఘటనకుకల కారణాలను తెలుసుకోవడానికిగాను జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
ప్లాంటుకోసం ప్రాణాలనే పణంగా పెట్టారు!
గత కొన్ని రోజులుగా ఈ కేంద్రంలో అమర్‌రాజా కంపెనీకి చెందిన బ్యాటరీలను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. 220 కేవీ ఓల్టుల బ్యాకప్‌ విద్యుత్తు రావడం కోసం ఈ బ్యాటరీలను అమర్చుతారు. ఇలా రెండు చోట్ల పనులు చేయాల్సి ఉండగా, ఒక చోటే పని పూర్తయింది. రెండో చోట పనులు చేస్తుండగా దగ్గరలోని ప్యానల్‌ బోర్డులో మంటలు రావడంతో సిబ్బంది ఆర్పడానికి గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం లేకపోయింది. మంటలు పెరిగితే విద్యుత్తు కేంద్రం మొత్తం కాలిపోతుందని గ్రహించిన ఉద్యోగులు.. మంటలను ఆర్పడం కోసం ప్రాణాలకు తెగించి మరీ అక్కడే ఉండిపోయారు. మంటలను చూసి వెంటనే బయటికి వచ్చేస్తే బతికేవారే కానీ, ప్లాంటును కాపాడుకోవడానికి వారు తమ ప్రాణాలనే పణంగా పెట్టారని ఓ ఇంజినీరు వ్యాఖ్యానించారు.
గతంలో రెండు సార్లు ఉత్పత్తికి విఘాతం
ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో గతంలో రెండు సార్లు విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. 1998లో వచ్చిన వరదలకు పవర్‌ ప్రాజెక్టు పూర్తిగా నీటమునిగింది. అప్పుడు ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయి కేంద్రాన్ని పునరుద్ధరించడానికి ఏడాది పట్టింది. ఆ తర్వాత మళ్లీ 2009లో వరదల సమయంలోనే సమస్యలు తలెత్తాయి. అప్పుడు కూడా ఉత్పత్తి ఏడాదిపాటు నిలిచిపోయింది. గతేడాది సెప్టెంబరులో పవర్‌ప్లాంటులోని మొదటి జనరేటర్‌ బ్రేక్‌ పాడ్‌ వద్ద స్వల్పప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్‌తో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంగా భావించారు. ఆ సమయంలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఇతర రాష్ట్రాల్లో..: 2013లో వచ్చిన భారీ వరదలకు ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగ జలవిద్యుత్‌ కేంద్రం పవర్‌హౌస్‌ దెబ్బతిని ఉత్పత్తిని దెబ్బతీసింది. విష్ణుప్రయాగ్‌ ప్రాజెక్టులో బురద, వరద నీరు వచ్చి చేరడంతో ఉత్పత్తి ఆగిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని ఉరి-2 పవర్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడున్న ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతింది.
జలవిద్యుత్కేంద్రంలో ఇదే తొలి ప్రమాదం
ఈనాడు డిజిటల్‌- నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం 2001 నుంచి అందుబాటులోకి రాగా గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూగర్భ జలవిద్యుత్పత్తి కేంద్రంలో మొదటి సారిగా చోటు చేసుకున్న ఈ భారీ ప్రమాదంలో తొమ్మిది మంది ఉద్యోగులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో కేంద్రంలో తీవ్ర విషాద ఛాయలు అలముకొన్నాయి. ప్రస్తుతం ప్రమాదం జరిగిన యూనిట్లలో కమ్ముకొన్ని పొగ మరో నాలుగు రోజుల వరకు అలాగే ఉండే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక యంత్రాల ద్వారా పొగను బయటికి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పొగ తొలగితేనే కానీ.. అధికారులు లోపలికి వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకునే వీలు పడదని జెన్‌కో సీఈ సురేశ్‌ తెలిపారు. నష్టం అంచనా వివరాలను సైతం అప్పుడే లెక్కించడం సాధ్యమవుతుందన్నారు.

ఇదీ చదవండి ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.