Confiscation of fake cotton seeds : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట సమీపంలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. రామల్లకోట సమీపంలో బొలెరో ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యవసాయ అధికారి, వీఆర్వోల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పల్లవి, ప్రిన్, కావ్య అనే మూడు కంపెనీలకు చెందిన రూ.830 ధర ఉన్న 4వేల నకిలీ విత్తనాల ప్యాకెట్లను గుర్తించారు. వాహన డ్రైవర్ తో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విత్తనాలు కొన్న వ్యక్తి కూడా ఉన్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణ పూర్తైన అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. అనామకులు తీసుకువచ్చిన ఇలాంటి పత్తి విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు సీఐ మహేశ్వరెడ్డి సూచించారు.
ఇవీ చదవండి :