కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన మృతుడు జనరల్ మేనేజర్ శ్రీనివాసులు కుటుంబానికి యాజమాన్యం పరిహారం ప్రకటించింది. మృతుడు కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తామని తెలిపింది.
శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని... పరిహారంగా రెండుకోట్ల రూపాయలు ఇవ్వాలని అంతకుముందు కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం రూ.50 లక్షలు మాత్రమే ఇస్తామని తెలిపింది. దీనిపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఖరికి ఆ పరిహారం తీసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.
అనంతరం నంద్యాల ప్రభుత్వాస్పత్రి నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్ల పరిధిలోని పొన్నవరంకు తీసుకెళ్లారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి. నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ఒకరు మృతి