Canara bank Cheating: రుణాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలు జిల్లా శ్రీశైలంలోని కెనరా బ్యాంకు అధికారులు తమని మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఆటో నడుపుకునేందుకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి...పూచీకత్తు లేకుండానే రుణాలు ఇప్పించి..బురుడి కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రుణాలు, సబ్సిడీ రుణాలు కూడా ఇస్తున్నామని బుకాయించి..అడిగిన మొత్తం కంటే ఎక్కువే ఇస్తామని మభ్య పెట్టారని వివరించారు.
కెనరా బ్యాంకులో...ఆ బ్యాంకు సిబ్బంది తమకు రుణాలు మంజూరు చేశారని, ఆ రుణంలో సగం సొమ్ము బ్యాంకు సిబ్బంది కాజేసినట్లు బాధితులు వాపోతున్నారు. తీరా దానిని కట్టమంటే కట్టట్లేదని గోడు వెళ్లపోసుకున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేసి రుణాన్ని పూర్తిగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది: లోకేశ్