అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ఆటో ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కురూ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. కోడుమూరు మండలం బైన్‌దొడ్డి గ్రామానికి చెందిన గిడ్డయ్య తనకుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెల్దుర్తి మండలం బోయినపల్లిలో అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గిడ్డయ్య మరణించారు. తీవ్రగాయాలైన ఎర్రక్క, మాదేవిలను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోడుమూరు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి : 'ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవు... పరీక్షలు యథాతథం'