రైతులు సాధారణంగా ఎద్దులతో వ్యవసాయం చేస్తారు. మరికొంత మంది ఆవులను, గేదెలను వినియోగిస్తుంటారు. వినూత్నంగా గుర్రంతో సాగు పనులు చేస్తున్నారు కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని చిన్న నగరికి చెందిన కృష్ణమూర్తి. తనకున్న మూడు ఎకరాల్లో ఆముదం పంట సాగు చేశారు. ఎద్దులు లేకపోవటంతో పెంచుకున్న గుర్రంతోనే కలుపు నివారణ కోసం ఆయన గుంటక తోలారు. దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
ఇవీ చదవండి: