ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఈ కర్రల సమరంలో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. వారిని ఆదోని, ఆలూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బన్ని ఉత్సవంలో హింస జరక్కుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసినా.. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టినా స్థానికులు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మొత్తానికి దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణ నష్టం లేకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బాలుడు మృతి.. : దేవరగట్టు కర్రల సమరానికి వెళ్తూ ఓ బాలుడు మృతి చెందాడు. కర్నాటకలోని శిరుగుప్పకు చెంది రవీంద్రనాథ్‌రెడ్డి కర్రల సమరాన్ని చూసేందుకు వస్తూ మృతి చెందాడు. అతను గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: