ETV Bharat / city

'దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు..' - జీ మేడపాడు న్యూస్​

వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపైనే దాడికి పాల్పడి తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతోంది. ఈ విషయంపై బాధితురాలు కాకినాడ కలెక్టరేట్​లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు.

sarpunch devi
సర్పంచ్​ పటాని దేవి
author img

By

Published : Jun 21, 2022, 10:26 AM IST

తమపై దాడికి పాల్పడి.. తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ.. ఓ మహిళా సర్పంచ్‌... కలెక్టర్‌కు విన్నవించుకున్న ఘటన కలకలం రేపింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడు సర్పంచ్‌గా వైకాపా మద్దతుతో పటాని దేవి ఎన్నికయ్యారు. తమ సొంత పార్టీ నాయకులే తమను వేధిస్తున్నారంటూ ఆమె సోమవారం.. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అన్ని పనులూ వారే చేసుకుంటూ.. తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ సర్పంచ్ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. సంతకం పెట్టడం వరకే తమ పని అని.. ఇంకేం మాట్లాడకూడదంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రశ్నించినందుకు.. తన భర్తపై దాడి చేసి.. తిరిగి తమపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని కొందరు వైకాపా నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

మాట్లాడుతున్న సర్పంచ్​ పటాని దేవి

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.